కాళీ జాగానా వేసేయ్ పాగా

0
165

మధు పెనుమాక

టుడేటీవీ యమ్ డీ

సత్తెనపల్లి పట్టణంలో ఇటీవల కాలంలో ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలాలు కనపడితే అక్కడ ఆక్రమణలు సిద్ధమౌతోన్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఆదికారులకు తెలియదా అంటే తెలిసే జరుగుతున్నాయని సమాధానం వినిపిస్తోంది. పట్టపగలే సత్తెనపల్లి జనసంచారం ఉన్న 14వ.వార్డు టిడిపి ఆఫీసు సెంటర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమ నిర్మాణం ప్రారంభించారు. ప్రతి నిత్యం రద్దీగా ఉండే హాస్పిటల్స్ . బ్యాంక్ లు
బైపాస్.రోడ్ .పార్టీఆఫీసులు, వ్యాపారసంస్థలతో నిత్యం రద్దీగా ఉండె ప్రాంతంలో. ఇక్కడే కాదు రవిమిల్ స్టోర్ రోడ్. రిజిస్టర్ ఆఫీసు ప్రాంతంలో అక్రమనలు జరుగుతుంటే మున్సిపల్ అధికారులకు తెలియకుండా జరగవని ప్రజలు అనుకుంటున్నారు. వేసేటప్పుడు ఆపితే పోద్ది
తరువాత ఆపసోపాలతో తొలిగిస్తున్నారు.అంతదూరం అవసరమా?. ముడుపుల ప్రలోభాలకు లొంగక పోతే ఇలా యెందుకు జరుగుతున్నాయని ప్రజలలో సందేహం కలుగుతోంది.అయ్యవార్లు కళ్ళుతెరవండి.ప్రభుత్వ ఆస్తులు కాపాడండి.అని ప్రజలు కోరుతున్నారు.

ఈ సమస్యలు సత్తెనపల్లి మున్సిపల్ కమీషనర్ మరియు తహశీల్దార్ చోరవతీసుకోని పరిష్కరించాలని లేనిఎడల ప్రత్యక్ష ఆందోళనకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here