గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

0
329

గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని ఈరోజు పెద్దపెల్లి ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు గ్రామ పంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , పెద్దపల్లి జిల్లాAITUC ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కడారి సునీల్ హాజరై మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో దినదినగండంగా బతుకుతున్నారని ఒక్కో గ్రామంలో నెలకు వేతనం రూ,1000/ రూ,2000/ దాటడం లేదని అది కూడా మూడు నెలలు ఆరు నెలల నుండి పెండింగ్లో ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు సఫాయి కార్మికులు దేవుళ్లతో సమానంగా కొనియాడి నెలకు రూపాయలు 8500 ప్రకటించడం జరిగిందని రూ 8500 రూపాయలు ప్రకటించి సంవత్సరం అయిపోయిందని ఇంతవరకు జీవో మాత్రం జారీ చేయలేదని చట్టబద్ధ హక్కులు ఈఎస్ఐ పీఎఫ్ కు నోచుకోలేదు కావున వేతన జీవోను జారీ చేసి ఈ ఎస్ఐ పీఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గోలి చంద్రమౌళి జిల్లా అధ్యక్షులు జ్ఞానేంద్ర చారి రాష్ట్ర కోశాధికారి, జిల్లా కౌన్సిల్ మెంబెర్స్, శనిగరపుచంద్రశేఖర్, శనగల శ్రీనివాస్, జంగం మల్లయ్య, నరసయ్య, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here