ఘనంగా ప్రారంభమయిన జలశక్తి అభయాన్ కార్యక్రమం

0
212

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఏనగుర్తి గ్రామంలో కేంద్ర జలవనరుల శాఖ వారు చేపట్టిన జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏనగుర్తి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో నెల రోజుల క్రితం చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి గుంతల నిర్మాణం, మొక్కలు నాటడం, బోరు బావి రీఛార్జి ఫిట్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. వీటి నిర్మాణ దశలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ లోని సాంకేతిక నిపుణులు డాక్టర్ సెంథిల్ కుమార్ బృందం పరిశీలించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తద్వారా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ , ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఏ పీ ఓ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here