ప్రజా అంకిత యాత్ర

0
253

పెద్దపల్లి జిల్లా
రామగుండం కార్పొరేషన్ లో ఓటర్ల పరంగా అతిపెద్ద డివిజన్ అయిన 45 వ డివిజన్ లో నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజాఅంకిత యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా డివిజన్ ప్రజలను కలిసి డివిజన్ లో నెలకొన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన లో ప్రజలు పారిశ్యుధ్యం, డ్రైనేజి, స్ట్రీట్లైట్స్ , రోడ్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరీ ముఖ్యంగా డ్రైనేజి నీళ్లు కుండీలు నిండిపోయి , ఆ నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయి అని మురుగువాసన భరించలేక పోతున్నాము అని, పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలు అవుతున్నాము అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మార్గనిర్ధేశకత్వములో ప్రజాసమస్యలను తీర్చడానికి ప్రత్యేకమయిన ప్రణాళికలు సిద్ధం చేశారు అని , అందులో భాగంగా ప్రజాఅంకిత యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
1. ప్రభుత్వం కేటాయించిన నిధులను ప్రజాసమస్యలపై ఖర్చు చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు
2. ప్రతి డివిజన్ కి కనీసం ఎంత ఖర్చు చేసే అవకాశం ఉందని
మా కరస్పాండెంట్ గడ్డం రాజు అడుగగా
తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఆదాయం పెంచడం, ఆ ఆదాయాన్ని పేదల అవసరాలకు పంచడం, ప్రజా అవసరాలకు ఖర్చు చేయడం లక్ష్యం అని , ప్రతి డివిజన్ కి అవసరమయిన మేర ఖర్చు చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన వెంబడి రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ శ్రీనివాస్ రావు, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, మరియు డివిజన్ ప్రజలు పర్యటించారు.
గడ్డం రాజు
Today TV
పెద్దపల్లి స్టాఫ్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here