కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

0
263

SLUG 11 9 19 SDPT DBK CONGRESS PARTY DHARNA

యాంకర్ పార్ట్.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీపీసీసీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ, రోడ్డు పై బైఠాయింపు.

వాయిస్ ఓవర్.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీపీసీసీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సంఘం అధ్యక్షుడు కోదండ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి గారు చేసిన హామీలను మర్చిపోయారు అన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని, అదేవిధంగా రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చ లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 38 వేల కోట్ల రైతు రుణాలు బకాయిలు ఉన్నాయని, నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇలా చేయడం వల్ల రైతు రుణమాఫీ కావాలంటే సుమారు ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అన్నారు. ఇలా కాకుండా ఏకకాలంలో లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. అలాగే రైతు బంధు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కనీసం 50 శాతం రైతులకు మాత్రమే జమ చేశారన్నారు. అలాగే సీఎం సొంత జిల్లాలోని ఎరువుల కొరత ఏర్పడితే మూడు రోజులపాటు క్యూలైన్లో నిల్చొని నాలుగో రోజు సొమ్మసిల్లి దుబ్బాక నియోజకవర్గం లోని అచ్చుమాయ పల్లికి చెందిన ఎల్లయ్య అనే రైతు మరణిస్తే ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ సినిమా టికెట్ల కోసం క్యూ లైన్ లో నిల్చుని చనిపోయిన వారితో పోల్చడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు పడుతున్న కష్టాలను చూసి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సిద్దిపేట్ జిల్లా ఇంచార్జ్ ఉస్మా షాకీర్ గారు, కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి గారు, కొండపాక మండల ఇంచార్జ్ అనంతుల శ్రీ స్మితా గారు, కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Voice 1. తూముకుంట నర్సారెడ్డి
Voice 2. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here