మద్యం షాపుల్లో 12వేల ఉద్యోగాలు

0
80

( MADHU P M.D )అమరావతి, ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అందులోనూ యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

👉ఈ మేరకు 3500 షాపుల్లో సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఎక్సైజ్‌శాఖ సన్నద్ధమైంది. జాయింట్‌ కలెక్టర్ల ద్వారా సిబ్బందిని ఎంపిక చేయనున్నారు. పట్టణాల్లోని షాపుల్లో నలుగురు, గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో ముగ్గురు చొప్పున పనిచేస్తారు

👉అందులో ఒకరు సూపర్‌వైజర్‌ కాగా, మిగిలిన వారు సేల్స్‌మెన్‌. సూపర్‌వైజర్‌కు రూ.17500, సేల్స్‌మెన్‌కు రూ.15,000 వేతనాలు ఇస్తారు. 3500 షాపులకు దాదాపు 12వేల మందిని తీసుకుంటారు.

👉 సూపర్‌వైజర్‌కు డిగ్రీ, సేల్స్‌మెన్‌కు ఇంటర్‌ విద్యార్హతగా నిర్ణయించారు. కాగా, గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు అందులోకి తీసుకున్న సిబ్బంది నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు స్వీకరించారు.

👉 ఇప్పుడా స్థానంలో బాండ్లను స్వీకరించనున్నారు. నగదు నిల్వలు వారివద్దే ఉంటాయి కనుక, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే బాండ్ల ఆధారంగా రికవరీ చేయడానికి నిర్ణయించారు.

👉ఒక ఏడాదికే
ఒక ఏడాది ప్రాతిపదికన మాత్రమే సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4380 షాపులు ఉండగా అందులో 20శాతం తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.

👉ఇలా ఏటా 20శాతం చొప్పున షాపులు తగ్గించుకుంటూ వెళ్తామని చెబుతోంది. దీనిప్రకారం వచ్చే ఏడాది కూడా షాపులు తగ్గుతాయి కనుక అప్పుడు

👉ఈ 12 వేల మందిలో 20శాతం మంది ఉపాధి కోల్పోతారు. అందువల్ల ఏడాది కాలానికే సిబ్బందిని తీసుకుంటే, ఎవరు ఉండాలనేది అప్పుడు నిర్ణయించవచ్చు అని భావిస్తున్నారు.

👉ప్రభుత్వ షాపులకు నోటిఫికేషన్‌ రెన్యువల్‌ చేసుకోకుండా మిగిలిపోయిన 777 షాపులను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎక్సైజ్‌ నిర్ణయించింది.

👉తొలుత అక్టోబరు నుంచి మొత్తం షాపులను నిర్వహించాలని భావించింది. కానీ లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా షాపులు మిగిలిపోయాయి

👉 దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో షాపుల నిర్వహణకు అనుభవంగా ఉంటుందని భావించి వెంటనే వాటిని చేపట్టాలని ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు చేస్తున్నారు. షాపులకు కావాల్సిన ఇళ్ల కోసం, మద్యం కేసులు సరఫరా చేసే రవాణా యాజమాన్యాల కోసం ఈ నోటిఫికేషన్‌ ఇస్తున్నారు.

👉తక్కువ అద్దె, సరైన ప్రాంతంలో ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here